November 9, 2010

కీళ్ల నొప్పులు.. హోమియో చికిత్స

నేటి ఆధునిక యుగంలో కీళ్ళ నొప్పులు చాలా మందిని వేధిస్తున్నాయి. ఒకప్పుడు కీళ్ళ నొప్పులు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే సమస్యగా భావించేవారు. కాని మారిన జీవనశైలి విధానం వలన కాలంతో పరుగులు తీస్తూ, సరియైన పోషక ఆహారం తీసుకోక, వ్యాయామం చేయుట వీలుకాక, ఎక్కువసేపు కదలకుండానే విధులను కూర్చుండే నిర్వర్తించ వలసి రావడంతో ఊబకాయం కూడా తోడై కీళ్ళ సమస్యను నేడు ఇరువై, ముప్ఫైయి ఏళ్ళ వయస్సులోనే ఎదుర్కోవడం జరుగుతుంది. […]
September 12, 2014

తల్లుల అలవాట్లు.. పిల్లల అగచాట్లు

సాధారణంగా స్ర్తిలు పరిసరాల ప్రభావాలవల్ల కొన్ని అలవాట్లకు లోనవుతారు. అవే అలవాట్లు బిడ్డ పుట్టిన తరువాత కూడా కొనసాగుతాయి. కొంతమంది తల్లులు ఒకే పక్క పడుకుని నిద్రపోతారు. రెండోపక్క పడుకుంటే వారికి నిద్రపట్టదు. బిడ్డ పుట్టిన తరువాత కూడా వారు ఎప్పుడూ ఒకేవైపు పడుకుని బిడ్డకు పాలివ్వడంవల్ల, బిడ్డ శరీరం ఒకేపక్క ఎక్కువ వత్తిడికి గురై బిడ్డ ముఖం, దవడలు ఒక్క పక్క తోసుకుపోయి రెండవ పక్క పుష్టిగా వుంటాయి. […]
December 5, 2018

అరిగింఛే శక్తి అల్లంలో పుష్కలం

 అల్లం ఘాటయిన ఆహార ద్రవ్యం. ఘాటయినవన్నీ వేడిచేసే స్వభావాన్ని సహజంగా కలిగి ఉంటాయి. కాబట్టి వేడి శరీర తత్వం ఉన్నవారికి అల్లం విషయంలో జాగ్రత్త అవసరం అవుతుంది.అటు మాంసాహారానికి, ఇటు శాకాహారానికి అల్లం అనుకూలంగా ఉంటుంది. ఆయా ఆహార పదార్థాలు తేలికగా అరిగేందుకు తోడ్పడుతుంది. ఆహార పదార్థాలు వికటించి విష దోషాలు శరీరంలో వ్యాపించకుండా ఇది రక్షణ నిస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం రోగులకూ, వాతరోగులకూ, సొరియాసిస్ రోగులకూ ఇది దివ్యౌషధం. […]
October 26, 2010

పొట్ట ఉబ్బరించిందా?

 పేగుల్లో తయారయ్యే గ్యాస్ ప్రమాదం కలిగించదు. కాని మహా ఇబ్బందని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన మీటింగులో ఉన్నప్పుడు గాని, లిఫ్ట్‌లో ఇతరులతో పాటు నిలబడినప్పుడు గాని, మొదటిసారి జీవిత భాగస్వామితో గడిపే ఏకాంత సమయాల్లో గాని గ్యాస్ విడుదల చేయాల్సి వస్తే సంకటస్థితి అంతా ఇంతాకాదు. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించి ఉదరంలో నొప్పిని కలిగిస్తున్నప్పుడు దానిని ఆయుర్వేద పరిభాషలో ‘ఆధ్మానం’ అనే పేరుతో పిలుస్తారు. కాగా మలద్వారం నుంచి విడుదలయ్యే […]
November 1, 2010

పరిమాణక్రమంలో వెన్ను నిర్మాణం

పరిణామక్రమంలో సకశేరుకాలైన వివిధ జంతువులు నాలుగు కాళ్లు కలిగి, వాటి వెన్నెముకలు, వెన్నుపూస భూమికి సమాంతరంగా ఉండేవి. మానవ పరిణామక్రమంలో మనిషి రెండు కాళ్లతో నడవడం మొదలుపెట్టాడు. మిగతా జంతువుల కన్నా తన చేతుల ద్వారా రాయడం, తద్వారా జ్ఞాన సముపార్జన పొంది ఎంతో అభివృద్ధి చెందాడు. క్రమంగా వెన్నెముకలు, వెన్నుపూస భూమికి లంబకోణ ముఖంలో మార్పు చెందింది. తన దైనందిన కార్యక్రమంలో అన్ని పనులు ముందుకు వంగి చేసుకోవడానికి […]
October 11, 2010

ఇదీ ‘అవాండియా’ కథ

టైప్‌-2 డయా బెటిస్‌లో ఇన్సులిన్‌ సెన్సిటై జర్‌గా విస్త్రతంగా చలామ ణీలోవున్న రోసిగ్లి టజోన్‌ (అవాండియా పేరుతో ప్రపంచ దేశాల్లో చలామణిలో ఉన్నది) వాడకం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ వుతున్నట్లు నిర్ధారణ కావడంతో తాజాగా సెప్టెంబర్‌, 2010లో ఐరోపా దేశాల్లో నిషేధించారు. అమెరికాలో దీనివాడకంపై మరిన్ని షరతులు విధించారు. మనదేశంలో ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు. 1999 నుండి చలామణీలో ఉన్న ఈ మందువల్ల ఈలోగా ప్రజలకు […]
November 22, 2010

మహిళల్లో పిసిఒడి సమస్య

నేడు మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో పాలిసిస్టిక్‌ ఓవరీన్‌ డిసీజ్‌(పిసిఒడి) ఒకటి. ఈ వ్యాధితో బాధపడుతున్న స్ర్తీలకు పీరియడ్స్‌ సరిగా రాకపోవడం, బరువు బాగా పెరిగి లావు కావడం, శరీరంలోని వివిధ భాగాల్లో అనవసర వెంట్రుకలు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి మందులు వాడి జీవన విధానాన్ని మార్చుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. 15నుంచి 30 సంవత్సరాల వయస్సులోపు మహిళలు పాలిసిస్టిక్‌ ఓవరీన్‌ డిసీజ్‌ […]
June 6, 2011

గర్భ నిరోధానికి సురక్షితమైన కాపర్టీ

కాన్పు, కాన్పుకు మధ్య కనీసం రెండు, మూడు సంవత్సరాల గ్యాప్‌ ఉన్నప్పుడే మహిళలు ఆరోగ్యంగా ఉండగల్గుతారు. ఇందుకోసం వారు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఫ్యామిలీ ప్లానింగ్‌ పద్ధతుల్లో అన్నింటికంటే సురక్షితమైనది ఇంట్రా యుటిరిన్‌ కాంట్రాసిప్ట్‌ డివైజ్‌ (ఐయుసిడి). దీన్నే కాపర్టీ లేదా లూప్‌ అని కూడా అంటారు. స్ర్తీలు కాపర్టీ వేయించుకోవడం వల్ల దాదాపు పది సంవత్సరాల వరకు గర్భం దాల్చకుండా ఉండవచ్చు.కాపర్టీలో నేడు […]
August 9, 2012

మలబద్ధకం (Constipation).. ప్రమాదకరం

నిర్ణీత సమయంలో క్రమబద్ధంగాలేక, కష్టతరమైన మలవిసర్జనను మలబద్ధకం (Constipation) అంటారు. ఇది వ్యాధి కాదు లక్షణం మాత్రమే. చిన్నపిల్లలో, 60 సంవత్సరాలు పైబడిన వారిలో దీనిని ఎక్కువగా గమనించవచ్చు. వీరు తీసుకొనే ఆహారం తక్కువ పరిమాణంలో వుండటం మూలకారణం. వారంలో మూడుసార్లు మాత్రమే మలవిసర్జన జరగడం, మలవిసర్జన సమయంలో బాధ కలిగి వుండటం, సంపూర్తిగా మలవిసర్జన కలగకపోవడం మలబద్దకంగా పరిగణించాలి. గతంలో చిన్న పిల్లలకు సెలవు రోజుల్లో విరేచన కార్యక్రమం […]
October 18, 2010

చిన్న పిల్లల్లో ఆస్తమా అపొహాలు – వాస్తవాలు

వర్షాకాలం తగ్గి క్రమేణా శీతాకాలం వస్తోంది. ఈ వాతావరణంలో ఆస్తమా ప్రకోపించడం పెరుగుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే ఆస్తమా గురించి తల్లిదండ్రుల్లో అనేక అపోహలున్నాయి. వీటిని నివృత్తి చేసే ప్రశ్నలు-జవాబులు… ఆస్తమా అంటే ఆయాసమేనా ? అవును ఆయాసమే. కానీ దగ్గు రూపంలో కూడా ఆస్తమా ఉండొచ్చు. ముఖ్యంగా రాత్రి పూట వచ్చే దగ్గు, అదేవిధంగా ఎదలో బిగపట్టినట్టు ఉండడం, వ్యాయామం తర్వాత దగ్గు రావడం కూడా ఆస్తమాకు తొలి […]
November 9, 2010

మీకు మీరే డాక్టర్‌

చిన్నపిల్లలున్న ఇల్లు! అసలే పిల్లలు! ఏం తినాలో, ఏం తినకూడదో వారికేం తెలియదు! 24 గంటలూ వారినే కనిపెట్టుకుని వుండాలంటే కొద్దిగా కష్టమే! అయినా కళ్ళల్లో వత్తులేసుకుని కాపలా కాస్తూనే వున్నప్పటికీ పిల్లలు ఏదో తినేశారు. అంతే – వాంతులు పట్టుకు న్నాయి. మరిప్పుడేం చెయ్యాలి? ఆందో ళన చెందనవసరంలేదు. కొద్దిగా జీలకర్ర తీసుకుని బాగా శుభ్రపరిచి, దోరగా వేయించాలి. ఆ వేగిన జీలకర్రను మెత్తటి వుండగా చేసుకుని ఓసీసాలో […]
November 16, 2010

జుట్టూడుతోందా?

జుట్టు రాలటమనేది ఎంతోమందిని తీవ్రంగా వేధించే సమస్యే. దీన్ని ఆపటం కోసం రకరకాల ప్రయత్నాలు చేయనివారుండరంటే అతిశయోక్తి కాదేమో. నిజానికి జుట్టు ఎందుకు రాలుతుంది? ఏయే అంశాలు దీనికి దోహదం చేస్తాయి? వీటిపై అవగాహన పెంచుకుంటే జుట్టు రాలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, మానసిక సమస్యలు.. ఇవన్నీ జుట్టు రాలిపోవటానికి దారి తీసేవే. పైగా సహజంగా జుట్టు రాలిపోయే వయసు కూడా ఒకప్పటికన్నా ఇప్పుడు […]